సెక్యులరిజం ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నారు

సెక్యులరిజం ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నారు

న్యూఢిల్లీ: భారత్‌‌లో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. అధికార బీజేపీ లౌకికవాదం ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తోందని థరూర్ మండిపడ్డారు. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని థరూర్ ఆరోపించారు. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించినా.. దాని సహజ నిర్మాణం దృష్ట్యా సెక్యులర్ కాన్‌‌స్టిట్యూషన్‌‌గానే ఉంటుందన్నారు. విద్వేష శక్తులు దేశ సెక్యులర్ స్వభావాన్ని మార్చలేవని స్పష్టం చేశారు. అలాంటి యత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. హిందూ-ముస్లిం ఏకత్వంపై కోపంగా ఉన్న వాళ్లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతన హిందూ-ముస్లిం యూనిటీకి చిహ్నమైన ఇండియాను ఎందుకు బాయ్‌‌కాట్ చేయట్లేదు అని ప్రశ్నించారు.