
హైదరాబాద్, వెలుగు: లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలని అడిషనల్ డీజీపీ మహేశ్‌భగవత్ యువతకు పిలుపునిచ్చారు. లక్ష్యం కోసం ప్రయత్నిస్తే విజేతలవుతారని, లేకుంటే అనుభవజ్ఞులుగా మిగులుతారని చెప్పారు. రామకృష్ణ మఠంలో నిర్వహిస్తున్న ‘శౌర్య’ శిబిరంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూపీఎస్ సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూని ఫేస్చేసేలా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. 2024 లో 1016 మందికి కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య 3వ ర్యాంక్ సాధించారన్నారు.
ఇంటర్వ్యూ కోచింగ్ కోసం పేద విద్యార్థులు 94407 00105 వాట్సాప్ నంబర్ కు వివరాలు పంపాలని మహేశ్‌భగవత్ సూచించారు. ‘టైమ్, స్ట్రెస్‌మేనేజ్‌మెంట్ పై చిట్కాలు చెప్పారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పాల్గొన్నారు.