జెనీలియా భర్త అనడంతో హర్ట్ అయ్యా

జెనీలియా భర్త అనడంతో హర్ట్ అయ్యా

ముంబై: సత్యం, బొమ్మరిల్లు, రెడీ మూవీలతో జెనీలియా తెలుగులో సూపర్ స్టార్‌‌డమ్ సాధించింది. ఆ సినిమాల తర్వాత మరికొన్ని చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ఆడియన్స్‌‌ను అలరించింది. తెలుగులోనే గాక పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన జెనీలియా సౌత్‌‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. కెరీర్ మంచి దశలో ఉండగానే బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌‌ముఖ్‌‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. జెనీలియాకు సౌత్‌‌లో ఉన్న క్రేజ్‌‌తో తనకు ఎదురైన ఇబ్బంది గురించి ఆమె భర్త రితేశ్ ఓ షోలో చెప్పుకొచ్చాడు. పాపులర్ హిందీ టెలివిజన్ ప్రోగ్రాం కపిల్ శర్మ షోలో జెనీలియాతో కలసి పాల్గొన్న రితేశ్ పలు విషయాల గురించి మాట్లాడారు.

‘నేను బెంగళూరులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌‌లో ఆడుతున్నా. ఆ టైమ్‌‌లో అక్కడ ఓ సౌత్ టీమ్‌‌లోని ఇద్దరు ప్లేయర్లు నా వైపు చూస్తూ అతడే జెనీలియా భర్త అంటూ గుసగుసలాడుకున్నారు. దీంతో నా అహం దెబ్బతింది. నేను ఇక్కడ జెనీలియా భర్తను, కానీ మహారాష్ట్రలో జెనీలియాను రితేశ్ భార్యగా చెప్పుకుంటారని వాళ్లకు బదులిచ్చాను. దానికి వాళ్లు సమాధానంగా.. రితేశ్ భార్య అని ఒక్క రాష్ట్రంలో మాత్రమే పిలుస్తారు. కానీ జెనీలియా భర్త రితేశ్ అని కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోనూ పిలుస్తారని చెప్పారు’ అని రితేశ్ పేర్కొన్నారు.