బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదమూడో వారం ప్రేక్షకులకు షాకిచ్చింది. నటన, గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతూ చౌదరి హౌస్ లో బలమైన కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అయితే అనూహ్యంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. నామినేషన్ రౌండ్‌లో చివరి వరకు పోరాడిన రీతూ, సహ కంటెస్టెంట్ సంజనతో పోటీపడి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఊహించని విధంగా రీతూ ఎలిమినేషన్ కావడంతో ప్రేక్షకులు షాక్ అవ్వగా.. తొటి కంటెస్టెంట్ ఎమోషనల్ లో మునిగిపోయారు.
ఎలిమినేషన్ లో తన పేరు ప్రకటించగానే రీతూ కన్నీటి పర్యంతమైంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ దగ్గరకు వెళ్లి "పవన్‌ని బాగా చూసుకోండి" అంటూ విలపించింది. తనతో కలవకుండా దూరంగా ఉంటున్న మరో కంటెస్టెంట్ కళ్యాణ్‌తో "కళ్యాణ్.. నువ్వు వాడితో పవన్ మాట్లాడడం లేదని వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ప్లీజ్ వాడితో మాట్లాడమని కన్నీటి హృదయంతో కోరింది. టాప్-5లో ఉంటానని బలంగా నమ్మి, ఆశపడి, అందుకు తీవ్రంగా కష్టపడ్డానని, "బిగ్ బాస్! ఎందుకు ఇలా చేశారని" ఆవేదనగా ఏడ్చేసింది.
అందరితో మాట్లాడిన రితూ.. ఎమోషనల్‌గా పవన్‌ని గట్టిగా హత్తుకుని బాగా ఆడు అని చెప్పి వేదికపైకి చేరుకుంది. అక్కడ హోస్ట్ నాగార్జున ఆమెను పలకరించి, ఎలా ఉంది ఫీలింగ్? అని అడిగారు. "టాప్-5లో ఉండాలని రోజు యూనివర్స్‌ని కోరుకున్నాను సర్. కానీ, వెరీ గ్రేట్ ఫుల్ సర్ అని చెప్తూ, బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞత వ్యక్తం చేసింది. రీతూ జర్నీకి సంబంధించిన వీడియోను ప్లే చేయగా, ఆమె తన బిగ్ బాస్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ప్రేమ, కోపం, నవ్వులు, ఆట పట్ల ఆమె నిబద్ధత ప్రదర్శితమయ్యాయి. ఈ జర్నీ వీడియో చూశాక రీతూ మరింత ఎమోషనల్ అయింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికిన రీతూకి, నాగార్జున ఒక ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లలో ఎవరు ఏ స్థానంలో ఉండాలో పొజిషన్ పెట్టమని కోరారు.
రీతూ తన అభిప్రాయం ప్రకారం స్థానాలను నిర్ణయించింది. భరణికి టాప్ స్థానం ఇచ్చింది. భరణి - మీరు బయటకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఫైర్ ఉండాలని అందరు చెప్పారని, దివ్యని నామినేట్ చెయ్యడం నాకు నచ్చలేదని రీతూ తన కారణం చెప్పింది. ఇక 6వ స్థానం సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ అన్న ఇప్పటికైనా మాట్లాడు.. ఆట తీరు మార్చుకో అని సలహా ఇచ్చింది. 5వ స్థానం సంజన ఇవ్వగా.. పవన్ కు మాత్రం 4 వ స్థానం ఇచ్చేసింది. 3వ, 2 వ స్థానం కోసం తనూజ , ఇమ్మాన్యుయేల్ - ఈ ఇద్దరి స్థానాలను నిర్ణయించకుండా, వారి ఫోటోల మధ్యలో ఉంచి, "మీరే డిసైడ్ అవ్వండి" అని చెప్పింది. ఇక డీమాన్ - మొదటి స్థానం కోసం ఎంచుకుంది. కప్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేసింది.
అయితే, తన నాల్గవ స్థానం కేటాయింపుపై పశ్చాత్తాపం చెందిన రీతూ, "ఒరేయ్ కళ్యాణ్! నువ్వు నాల్గవ స్థానం కాదురా" అని మళ్లీ రెండు, మూడు, నాలుగు స్థానాల బోర్డ్స్‌ని కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ల మధ్యలో పెట్టి "మీరే తీసుకోండి" అని చెప్పింది. తన హృదయాన్ని బరువెక్కిస్తూ, చివరి వీడ్కోలు చెప్పి రీతూ బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించింది. టాప్-5కు చేరాలన్న ఆమె కల తీరకుండానే, ఊహించని ఎలిమినేషన్‌తో ఆమె జర్నీ ముగిసింది.
