లాలూ భుజం, వెన్నెముకకు గాయాలు

లాలూ భుజం, వెన్నెముకకు గాయాలు

ఆర్జేడీ చీఫ్, బిహార్​మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్​గాయాలపాలయ్యారు. పట్నాలోని నివాసంలో మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భుజం ఎముక విరగగా.. వెన్నెముకకు గాయమైనట్లు లాలూ సన్నిహితులు తెలిపారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ఎముక విరిగినట్లు గుర్తించారు. ట్రీట్మెంట్ అనంతరం ఆయనను ఇంటికి పంపారు. లాలూ ప్రసాద్ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోర్టు పర్మిషన్ సైతం తీసుకున్నారు.

దాణా కుంభకోణానికి సంబంధించి లాలూ ప్రసాద్ పలు కేసుల్లో దోషిగా తేలారు. దీంతో రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్పై ఉన్నారు.