V6 News

  లాలూకు  కిడ్నీ ఇచ్చిన బిడ్డ రోహిణి ఆచార్య

  లాలూకు  కిడ్నీ ఇచ్చిన బిడ్డ రోహిణి ఆచార్య

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు సోమవారం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని లాలూ కొడుకు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వెల్లడించారు. ‘‘డాడీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ విజయవంతమైంది. ఆయనను ఐసీయూకు తరలించారు. అక్క రోహిణి ఆచార్య కిడ్నీ ఇచ్చారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ల కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు” అని ఆయన ట్వీట్ చేశారు. లాలూ ఆస్పత్రిలో ఉన్న వీడియోను షేర్ చేశారు. ఆపరేషన్ కు ముందు తండ్రితో దిగిన ఫొటోను రోహిణి పోస్టు చేశారు. ‘‘కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. అంతా మంచి జరగాలని ఆశీర్వదించండి” అని ట్వీట్ చేశారు. లాలూ, రోహిణి ఆరోగ్యం బాగుండాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, మసీదుల్లో ఆర్జేడీ కార్యకర్తలు ప్రార్థనలు చేశారు.