పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర… ఆర్కే మఠ్ ఆన్ లైన్ క్లాసులు

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర… ఆర్కే మఠ్ ఆన్ లైన్ క్లాసులు

పిల్లల పోషణలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. పిల్లల అలవాట్లపై పెద్దల ప్రభావం ఉంటుంది. నైతిక విలువలు, ఉన్నత జీవన విధానాలు అలవాటు చేయడంలో తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. దీనికి సంబంధించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఆర్కే మఠ్ నడుం కట్టింది. తల్లిదండ్రులకు మార్గరదర్శనం చేసేలా.. ప్రేరణ కలిగించేలా.. ప్రోత్సాహానిచ్చేలా ఆన్ లైన తరగతులకు రూపకల్పన చేసింది. ఆర్కే మఠ్ స్వామిజీలు, అనుభవజ్ఞులు, మానసిక నిపుణులు … క్లాసులు చెబుతారు. తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి.. తమ విలువైన సూచనలు ఇస్తారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 17 వరకు తరగతులు జరుగుతాయి. రెండు నెలల కోర్సు.. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 20 ఏళ్లకు పైబడిన వారే అర్హులు.

రామకృష్ణపరమహంస, వివేకానందుల బోధనల ఆచరణ, మాతృమూర్తి శారదా దేవి బోధనలు, ధ్యానం, భజనలు, మానవీయ, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం… పిల్లలతో ఎలా మెలగాలనే విషయాలపై ఈ తరగతుల్లో చెప్పనున్నారు.  అంతేకాదు యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.