100 Trailer: ఆసక్తిగా ‘ది 100’ ట్రైలర్.. ‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ హిట్ కొట్టేనా?

100 Trailer: ఆసక్తిగా ‘ది 100’ ట్రైలర్.. ‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ హిట్ కొట్టేనా?

‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్‌‌‌‌కె సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది హండ్రెడ్’.రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో  రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ కలిసి నిర్మించారు. జులై 11న సినిమా విడుదల కానుంది.

శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ‘లైఫ్‌‌‌‌లో జరిగిపోయింది మార్చలేం. కానీ జరగబోయే దాన్ని కచ్చితంగా మార్చొచ్చు’అనే డైలాగ్‌‌‌‌తో ప్రారంభమైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను ఎమోషనల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా కట్ చేశారు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్‌‌‌‌గా ఆర్‌‌‌‌‌‌‌‌కె సాగర్ కనిపిస్తున్నాడు. తను సర్వీస్‌‌‌‌లో ఉన్నంత వరకు వెపన్ వాడకూడదని లిమిటేషన్ పెట్టుకుంటాడు.

అయితే ఓ కేసులో తనను సస్పెండ్ చేస్తారు. ‘వాడకూడదు అనుకున్న వెపన్  తన చేతిలో ఎందుకు ఉంది’అంటూ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ చివరిలో చెప్పడం క్యూరియాసిటీని పెంచింది. హీరోయిన్‌‌‌‌గా  మిషా నారంగ్ నటించగా, ధన్య బాలకృష్ణ, నటరాజన్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటించారు.  హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.