
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో దివీస్ లేబొరేటరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లను హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద పేషెంట్లు, వారి సహాయకుల కోసం రూ. 72.36 లక్షల నిధులతో గాంధీలో 23 ఆర్వో వాటర్ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు దివీస్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.