
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టు రోడ్డులో ఆటోను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం ఎయిర్పోర్టు రోడ్డులో 12 మందితో ఓ ఆటో వెళ్తోంది. డెకత్లాన్ వద్దకు రాగానే ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో రమావత్ లక్ష్మణ్(45) అనే వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. మృతుడు నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం గువ్వాళగుట్ట గ్రామనికి చెందిన వ్యక్తిగా తెలిసింది.
మరో 11 మందికి గాయాలు కాగా వారిని శంషాబాద్ సన్రైస్ హాస్పిటల్కు తరలించారు. ఇందులో హనుమంతు( 33), వెంకటమ్మ(34), విజయ(24) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద వివరాలు ఎయిర్పోర్టు అధికారులు, పోలీసులు బయటికి వెల్లడించలేదు. అటుగా వెళ్తున్న సీపీఎం నాయకులు వీడియోలు తీసి పెట్టడంతో ప్రమాద విషయం బయటకు వచ్చింది.