
ఉంగుటూరు మండలం కోడూరుపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో డివైడర్ను ఢీకొంది. ఓవర్ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో విజయవాడ వైపు వస్తున్న అంబులెన్స్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.