V6 News

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడి ముగ్గురు మృతి.. ఒకరికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడి ముగ్గురు మృతి.. ఒకరికి గాయాలు


హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రుడిని, మృతదేహాలను పోస్ట్‎మార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ మొయినుద్దీన్, మోయిన్, కీర్తి సాగర్‎గా గుర్తించారు. యోగేష్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.