గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని స్పాట్‎లోనే మహిళ మృతి

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని స్పాట్‎లోనే మహిళ మృతి

గచ్చిబౌలి, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. నగరంలోని టోలిచౌకిలో నివాసం ఉంటున్న అమీనుద్దీన్, జీనత్ ఉనీసా(55) దంపతులు మంగళవారం మధ్యాహ్నం బెల్ ఎంఐజీలో ఉండే బంధువుల ఇంటికి స్కూటీపై బయల్దేరారు. మార్గమధ్యలో హెచ్ సీయూ సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో వీరిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఉనీసా స్పాట్‎లో చనిపోయింది. భర్త అమీనుద్దిన్​కు స్వల్ప గాయాలయ్యాయి. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చిన కర్నాటకకు చెందిన బస్సు వీరిని  ఢీకొట్టిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.