క‌రీంన‌గ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదం.. ఒకరు మృతి

క‌రీంన‌గ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదం.. ఒకరు మృతి

క‌రీంన‌గ‌ర్ జిల్లా జగిత్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గంగాధర మండలం కొండన్నపల్లి, రామడుగు మండలం వెదిర శివారులో కారు, బైక్​ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ సీతారాంపూర్ చెందిన నందలి ప్రభాకర్ రావు దంప‌తులు గంగాధర మండలం మల్లాపూర్ నుండి కరీంనగర్ వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ రావు అక్కడికక్కడే మృతిచెందగా అత‌ని భార్య కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంట‌నే స్థానికులు ఆమెను 108 వాహనంలో కరీంనగర్ తరలించారు. సంఘటన స్థలాన్ని రామడుగు, గంగాధర ఎస్ఐలు అనూష, వివేక్‌లు పరిశీలించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై గంగాధ‌ర పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.