
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ కొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సింగపూర్ నుండి చెన్నై చేరుకుని అక్కడి నుండి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నట్లు ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ లారీని నడుపుతున్న డ్రైవర్ ను నగరి సీఐ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.