చెరువు గట్టుకు వెళ్లి వస్తుంటే ప్రమాదం.. కొడుకు, భర్త కండ్ల ముందే భార్య మృతి

చెరువు గట్టుకు వెళ్లి వస్తుంటే ప్రమాదం.. కొడుకు, భర్త కండ్ల ముందే భార్య మృతి

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళా అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త, కొడుకు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ గుర్రం గూడెం చెందిన ఓ కుటుంబం స్కూటీపై నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు దేవస్థానానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‎హెచ్ 65)పై దండు మల్కాపురం దగ్గర గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో పొట్టిగల్లు దుర్గ (25) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, కొడుకు‎కు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కండ్ల ముందే దుర్గ చనిపోవడంతో ఆమె భర్త, కొడుకు గుండెలవిసేలా రోదించారు.