
జహీరాబాద్ కొత్తకోట బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మదర్ థెరిసా జంక్షన్ లో ఓ ప్రైవేట్ బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు నుండి జహీరాబాద్ వస్తున్న బస్సును కొత్తకోట వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జనుజ్జ అయ్యింది.కారులో బ్యాన్ చేసిన గుట్కాలను తరలిస్తున్నారు. అయితే కారులో ఉన్న మరో వ్యక్తి పారిపోయినట్లు సమచారం.