ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ

 ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.  బారామతి సమీపంలో  టు వీలర్ పైకి టిప్పర్  లారీ దూసుకెళ్ళింది. ఈ ఘటనలో  టూవీలర్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రెండు సంవత్సరాల బేబీ మృతి చెందింది. ఇక గాయపడిన  మహిళ గర్భవతి అని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.