హైదరాబాద్: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. JNTU నుంచి హైటెక్ సిటీకి వెళ్తుండగా టీఎస్ 09 ఎఫ్యూ 5136 నంబర్ బెలినో కారు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కించారు.
ఈ వాహనాన్ని నడిపింది సూడాన్ దేశస్తులుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఏమీ కాలేదు. ద్విచక్ర వాహనం పై ఉన్న వాహనదారుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
