నార్సింగి ఓఆర్ఆర్‎పై రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ముగ్గురికి గాయాలు

నార్సింగి ఓఆర్ఆర్‎పై రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టినాగులపల్లి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ముందు వెళ్తోన్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

గాయపడ్డ వారి ఆరోగ్యం ప్రస్తుతం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. డీసీఎం బలంగా ఢీకొట్టడంతో కారు తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. కారు వెనక భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. డీసీఎం డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన నార్సింగి పోలీసులు.. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో ఓఆర్ఆర్‎పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు.