బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘటన

బైక్ అదుపుతప్పి ఒకరు మృతి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘటన

తాడ్వాయి, వెలుగు: బైక్ అదుపుతప్పి ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. తాడ్వాయి మండలం లింగాలకు చెందిన ఊకె సారయ్య (22), ఆగబోయిన మల్లేశ్​ బైక్ పై సోమవారం పస్రాకు వెళ్తున్నారు. కోడిశాల – ఒడ్డుగూడెం మార్గమధ్యలో బైక్ అదుపుతప్పి మిషన్ భగీరథ పిల్లర్ ను ఢీకొట్టడంతో సారయ్య  స్పాట్ లో చనిపోయాడు. మల్లేశ్​ రోడ్డు పక్కన పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.  తాడ్వాయి కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముదురుకోళ్ల తిరుపతి పస్రాకు వెళ్తూ చూసి.. వెంటనే మల్లేశ్​ను ప్రైవేటు వెహికల్ లో ములుగు ప్రభుత్వ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాడ్వాయి ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.