శామీర్ పేట్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్ పేట్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్  ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు)పై రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీ, బొలెరో వాహనం ఢీ కొనడంతో ముగ్గురు స్పాట్ లో నే చనిపోగా..ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్  ను ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో  బొలెరోలో  ఉన్న ఇద్దరు, లారీలో ఉన్న ఒకరు  అక్కడిక్కడకే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ALSO READ :క్షుద్ర పూజల్లో బీరు టిన్నులు.. ట్రెండ్​ మారింది బ్రో