అర్చకుల సొంత ఖర్చుతో.. ఆలయ రోడ్డుకు మరమ్మతు

అర్చకుల సొంత ఖర్చుతో.. ఆలయ రోడ్డుకు మరమ్మతు

ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగించే ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారింది.  రోడ్డు పనులు సాంక్షన్ అయినా పనులు మాత్రం జరగలేదు.

దీంతో రోడ్డు అభివృద్ధి కోసం ఎదురుచూసి.. విసిగి వేసారిన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు, అధికారులు చివరకు తమ సొంత ఖర్చులతో మరమ్మతు పనులు మొదలుపెట్టారు. ఈ పనులను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందర రాజన్ ప్రారంభించారు. చిలుకూరి బాలాజీ స్వామి ఆజ్ఞతోనే రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తున్నమని, సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తిచేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించామని తెలిపారు.

అయితే గతంలో తొమ్మిదిసార్లు ఈ రోడ్డుపైనున్న గుంతలను మట్టితో పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఈ నామమాత్రపు మరమ్మతులు చేసిన ప్రతిసారీ కొన్ని రోజుల్లోనే రోడ్డు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడేవారు. కొందరు ద్విచక్ర వాహనాల పైనుంచి కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.