
రామాయంపేట నుంచి సిద్దిపేటకు వెళ్లే మెయిన్ రోడ్డు చాలా చోట్ల అధ్వానంగా మారింది. రామాయంపేట మండలం కోనాపూర్ సమీపంలో దాదాపు మూడు కిలోమీటర్ల గుంతలు పడి, కంకర తేలి వెహికల్స్ రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారి నెలలు గడుస్తున్నా.. ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోలేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించని ఆఫీసర్లు శనివారం రోడ్డు రిపేర్లుమొదలుపెట్టారు. కారణం.. ఆదివారం సిద్దిపేటకు వస్తున్న సీఎం కేసీఆర్ ఈ రూట్‌లో కామారెడ్డికి వెళ్లే చాన్స్ ఉండడంతో రిపేర్లు చేశారు. – మెదక్/రామాయంపేట, వెలుగు