న్యూజెర్సీలోని ఓ జువెల్లరీ షాప్ లో చోరీ

న్యూజెర్సీలోని ఓ జువెల్లరీ షాప్ లో చోరీ

అమెరికాలోని న్యూజెర్సీలో అందరూ చూస్తుండగానే ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.జ్యువెల్లరీ షాప్ లోకి ప్రవేశించిన దొంగలు దుకాణంలోని ఓ మహిళను కొట్టి.. స్టాఫ్ ను బెదిరించి అక్కడ షో కేస్ లో ఉంచిన గోల్డ్ ఐటమ్స్ ను ఎత్తుకెళ్లారు. న్యూజెర్సీలో భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే ఓఎంజీ రోడ్ లో ఉన్న ఈ దుకాణంలోకి మొత్తం ఎనిమిది మంది దుండగలు వచ్చి ఈ దురాగాతాన్ని పాల్పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్న వారిని తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీకి పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.