
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని లులు మాల్లో ‘రోబోవర్స్–2025’ పేరిట గురువారం రోబోటిక్ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. పిల్లలతో సహా అన్ని వయసుల వారికి అవగాహన కల్పించేలా ఈ నెల 21 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని మాల్ రీజినల్డైరెక్టర్అబ్దుల్ ఖాదిర్షేక్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రామ్ డిస్ప్లే, 3డీ ప్రింటింగ్ ల్యాబ్, హ్యుమనాయిడ్ రోబో, ఇంటరాక్టివ్ ఫ్లోర్ టైల్స్ వంటి ప్రదర్శనలను ఫ్రీగా అందుబాటులో ఉంచామన్నారు. ఐపీఎల్లో ఫేమస్ అయిన రోబోట్ డాగ్ ‘చంపక్’ కూడా ప్రదర్శనలో ఉందన్నారు.