ఆఫ్గనిస్థాన్‌లో రోబో వెయిటర్

ఆఫ్గనిస్థాన్‌లో రోబో వెయిటర్

లార్జ్ సైజ్ పిజ్జా ఆర్డర్ చేసిండు అఫ్జల్ ..ఓ ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కు ఆర్డర్ పెట్టింది జారా.. ఆర్డర్లు బుక్కైనయ్ . కొంత టైం తర్వాత ఆర్డర్ టేబుల్ దగ్గరకు వచ్చేసింది. మొహంలో చిరునవ్వుతో ఆర్డర్లు అందుకున్నరిద్దరు.ఎందుకంటే, ఆ ఆర్డర్ తెచ్చిచ్చింది ఓ లేడీ రోబో మరి . అయితే, అందులో స్పెషలేముంది..? ఈ మధ్య అది కామన్ అయిపోయింది కదా..అంటరా? యుద్ధంతో నలిగిపోయి, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన ఆఫ్గనిస్థా న్ లో తొలిసారిగా పనిస్టార్ట్ చేసింది ఈ రోబో మరి. అందుకే అది అంత స్పెషల్ . ఆ రోబో పేరు టిమియా. ఆ దేశ రాజధాని కాబూల్ లోని టైమ్ అనే రెస్టారెంట్ లో పోయిన నెలలో డ్యూటీ ఎక్కింది టిమియా. వచ్చి పోయే వారికి ఫుడ్డుతో పాటు హ్యాపీనెస్ ను సర్వ్ చేస్తోంది. ఇది జపాన్ లోనే తయారైనా, రెస్టారెంటోళ్లు కొంచెం లోకల్ టచ్ ఇచ్చిన్రు. ఇది మూడు భాషల్లో గలగలా మాట్లాడేస్తది. దరి, పాష్తోతో పాటు ఇంగ్లిష్ లో కబుర్లు చెప్తది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడోళ్లు హిజబ్ వేసుకోవడం ఆనవాయితీ కదా. అయితే, టిమియా హిజబ్ వేసుకోకపోయినా, వేసుకున్నట్టు కనిపించేలా తలను డిజైన్ చేసింది రెస్టారెంట్ టీమ్ . రెస్టారెంట్ కెళ్లే పిల్లలు టి మియాను చూసి ము చ్చటపడిపోతున్రు. అసలు రోబోను చూస్తమని కలలోనైనా అనుకోలేదంటున్రు. నిజానికి యుద్ధంతో నలిగిపోయిన ఆ దేశం, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉంటోంది. చదువులోనూ వెనకబడిపోతోంది. ఆ పరిస్థితి రెండు మూడేండ్ల నుంచి మారుతోంది. 2017లో దేశంలోని హెరాత్ అనే సి టీకి చెందిన మహిళల రోబోటిక్స్ టీమ్ , సో లార్ కరెంట్ తో నడిచే రోబోను తయారు చేసింది. అమెరికాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అప్లై చేసుకుంది. కానీ, అక్కడి ఛాందసవాదులు మాత్రం దానికి అడ్డు చెప్పిన్రు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో పాల్గొనాల్సిందేనని వాళ్లు పోరాడిన్రు. ఆ పోరాటంలో గెలిచిన్రు. పోటీలో పాల్గొని రోబో ఫెస్ట్ లో అవార్డు గెలుచుకొచ్చి చూపించిన్రు. ఇప్పుడు టిమియా విషయంలోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయి.ఇప్పటికే ఉద్యోగాల్లేక అల్లాడిపోతున్న తమకు,ఇలాంటి రోబోల వల్ల ఉద్యోగాలు అసలు దొరికే చాన్సే లేకుండా పోతుందని యువత అంటోంది.