కేరళ గుడికి రోబో ఏనుగు

కేరళ గుడికి రోబో ఏనుగు
  • డొనేట్ చేసిన జాకీష్రాఫ్, పెటా 

త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడుంగళ్లూర్ లోని నెడియథలి శివ టెంపుల్ లో రోబోటిక్ ఏనుగు సందడి చేస్తోంది. ఈ గుడిలో ఉత్సవాలకు, ఇతర కార్యక్రమాలకు వినియోగించేందుకు గాను అసలైన ఏనుగు మాదిరిగానే ఉండే ఈ రోబోటిక్ ఎలిఫెంట్ ను పెటా ఇండియాతో కలిసి బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ డొనేట్ చేశారు.

మూడు మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువైన ఈ మెకానికల్ ఏనుగుకు ‘థాలీశ్వరన్’ అని నామకరణం చేశారు. దీనిని శనివారం వేడుకగా  గుడిలోకి ఆహ్వానించారు. నిజమైన ఏనుగులకు హింసను తప్పించేందుకే ఈ రోబో ఏనుగును డొనేట్ చేశానని జాకీ ష్రాఫ్ చెప్పారు.