
తన యాక్టింగ్ టాలెంట్‌తో బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది అలియా భట్. రణవీర్ సింగ్‌కి జంటగా ఆమె నటించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. కరణ్ జోహార్ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది అలియా. సినిమాలో ఆమె బెంగాలీ కుటుంబానికి చెందిన రాణీ చటర్జీ అనే పాత్రను పోషించింది. దీంతో ఇటీవల కోల్‌కతాలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌కి బెంగాలీ స్టైల్‌లో చీరకట్టుకుని హాజరైన అలియా భట్.. బెంగాలీలో మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం కొన్ని లైన్స్ రాయించుకుని సిన్సియర్ స్టూడెంట్‌లా బట్టీ పట్టింది.
కానీ స్టేజ్ పైకి రాగానే ఆ లైన్స్ మర్చిపోయింది. దీంతో నువ్వు హోమ్ వర్క్ బాగానే చేశావ్.. కానీ ఎగ్జామ్ హాల్‌లో మర్చిపోయావ్’ అంటూ ఆమెను టీజ్ చేశాడు రణవీర్ సింగ్. ఇదంతా ‘రాఖీ ఔర్ రాణీ కీ కోల్‌కతా కహానీ’ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేసింది అలియా. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, జయా బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అలియా భట్.