లావర్ కప్ 2022 తర్వాత రిటైర్ అవుతా

లావర్ కప్ 2022 తర్వాత రిటైర్ అవుతా

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. సెప్టెంబర్‌ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు  లండన్ లో జరిగే లావర్ కప్ తర్వాత క్రీడల నుండి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. ట్విట్టర్ వేదికగా ఫెదరర్ ఈ విషయాన్ని తెలిపారు. కెరీర్ లో ఎన్నోసార్లు గాయాలతో బాధపడ్డానని, ఇప్పుడు రిటైర్ అయ్యే టైమ్ వచ్చిందని తన పోస్ట్ లో చెప్పాడు. గత 24ఏళ్లుగా 1500 పైగా మ్యాచ్ లు ఆడానని, తనని అభిమానించిన  ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. 

స్విట్జర్లాండ్ కు చెందిన 41 ఏళ్ల ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్ స్లామ్స్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 6, ఫ్రెంచ్ ఓపెన్ 1, వింబుల్డన్ 8, యూఎస్ ఓపెన్ 5 టైటిళ్లు ఉన్నాయి. 310 వారాల పాటు టెన్నిస్ లో ప్రపంచ నంబర్ వన్ గా కొనసాగిన ఘనత ఫెదరర్ దే. కరోనా కాలంలో ఫెదరర్ పెద్దగా పోటీల్లో పాల్గొనలేదు. ఈ మూడేళ్లు గాయాలు, శస్త్రచికిత్సలతోనే సరిపోయింది. కేవలం ఆటగాడినే కాకుండా మంచి వ్యక్తిత్వతంతోనూ ఫెదరర్ అందరి మనసులు గెలుచుకున్నాడు.