బోపన్న కొత్త చరిత్ర..అత్యధిక వయసులోస్లామ్‌‌ ఫైనల్‌‌ చేరిన తొలి ప్లేయర్‌‌

బోపన్న కొత్త చరిత్ర..అత్యధిక వయసులోస్లామ్‌‌ ఫైనల్‌‌ చేరిన తొలి ప్లేయర్‌‌
  • యూఎస్‌‌ ఓపెన్‌‌ డబుల్స్‌‌లోటైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత

న్యూయార్క్‌‌: ఇండియా స్టార్‌‌ ప్లేయర్‌‌ రోహన్‌‌ బోపన్న.. వరల్డ్‌‌ టెన్నిస్‌‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఓపెన్‌‌ ఎరాలో అత్యధిక వయసు (43 ఏళ్ల 6 నెలలు)లో గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్‌‌ చేరిన తొలి ప్లేయర్‌‌గా నిలిచాడు. యూఎస్‌‌ ఓపెన్‌‌లో భాగంగా గురువారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ సెమీస్‌‌లో ఆరోసీడ్‌‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌ (ఆస్ట్రేలియా) 7-–6 (7/3), 6–2తో పియారి హెర్బర్ట్‌‌-– నికోలస్‌‌ మహుత్‌‌ (ఫ్రాన్స్‌‌)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. దీంతో డానియెల్‌‌ నెస్టర్‌‌ (43 ఏళ్ల 4 నెలలు) రికార్డును బోపన్న బ్రేక్‌‌ చేశాడు.

 ఓవరాల్‌‌ కెరీర్‌‌లో బోపన్న గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్‌‌ చేరడం ఇది రెండోసారి. 2010 తొలిసారి టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించాడు. గంటా 34 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండో–ఆసీస్‌‌ ద్వయం ఏస్‌‌లతో హడలెత్తించింది. బలమైన గ్రౌండ్‌‌ స్ట్రోక్స్‌‌తో పాటు క్రాస్‌‌ కోర్టు ర్యాలీలతో ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేసింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌‌లో బోపన్న జోడీ ఏడు సెట్‌‌ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్‌‌ మొత్తంలో బోపన్న జంట ఆరు ఏస్‌‌లు, నాలుగు డబుల్‌‌ ఫాల్ట్స్​ చేసింది. ఆరు బ్రేక్‌‌ పాయింట్లలో నాలుగింటిని కాపాడుకుని 36 విన్నర్లతో మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. 14 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేసింది.హెర్బర్ట్‌‌–నికోలస్‌‌ జోడీ ఏడు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌తో పాటు 19 విన్నర్లే సాధించడంతో ఓటమి తప్పలేదు.