IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరుగుతున్న తొలి డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ నెగ్గి ఫీల్డింగ్ తీసుకోవడంతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఇక ఎంఐ టీమ్ కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9) తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు కొట్టి.. ఊపు మీద కనిపించినప్పటికీ.. ముకేష్ కుమార్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మని సైతం డకౌట్ చేయడంతో కేవలం 18 పరుగులకే ముంబై రెండు వికెట్లని కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక క్రీజులోకి వచ్చిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్– రోహిత్ శర్మతో కలిసి ఇన్సింగ్స్ ని ముందుకు నడిపించాడు. వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం అయినా తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ వేసిన (9.3) ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 71 పరుగులకే మూడు వికెట్లని ముంబై కోల్పోయినట్లు అయింది. ఆ తర్వాత వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో ముకేష్ కుమార్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు.
►ALSO READ | IPL 2026: రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మధ్య హైటెన్షన్ పోరు.. ఏ జట్టు గెలుస్తుందంటే!
ఇక ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ని ఢిల్లీ బౌలర్లు దెబ్బకొట్టారు. డీసీ బౌలర్లలో ముకేష్ కుమార్ కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా.. విప్రాజ్, అక్షర్ పటేల్ చేరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి కేవలం 91 పరుగులు మాత్రమే చేసింది.
Clearing the ropes with ease 👌
— IndianPremierLeague (@IPL) April 4, 2026
🎥 Delightful maximums from Rohit Sharma and Surya Kumar Yadav 🔥
Updates ▶️ https://t.co/lufWYIGWql#TATAIPL | #KhelBindaas | #DCvMI | @mipaltan pic.twitter.com/ULucUbjSCK
