వీడియో:అయ్యో రోహిత్..ఇంత మతి మరుపా..? మరీ చిన్న పిల్లాడిలా

వీడియో:అయ్యో రోహిత్..ఇంత మతి మరుపా..? మరీ చిన్న పిల్లాడిలా

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలో ఒక అద్భుతమైన బ్యాటర్, కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు తన పేరు మీద లిఖించుకున్న హిట్ మ్యాన్ లో ఒక చిన్నపిల్లవాడు కూడా దాగి ఉన్నాడని చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ప్రస్తుతం ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మతిమరుపు అలవాటు ఉన్న రోహిత్.. తాజాగా ఒక విషయంలో దొరికిపోయాడు. 
                
టీమిండియాలో బాగా మతిమరుపు ఉన్న వారిలో రోహిత్ శర్మ ఒకడు. ఈ విషయం కోహ్లీ చెప్పి ఆరేళ్ళు కావొస్తుంది. 2017లో విరాట్.. రోహిత్ గురించి మాట్లాడుతూ.. తన వస్తువులన్నీ రోహిత్ మర్చిపోతాడని చెప్పాడు. ఐఫోన్లు చివరకు పాస్‌పోర్టు కూడా రోహిత్ కి గుర్తుండదని సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పుడేదో సరదాగా చెప్పాడు అనుకున్నాం కానీ ఆదే నిజమైంది. పూర్తి వివరాల్లోకెళ్తే..శ్రీలంక మీద గ్రాండ్ విక్టరీ కొట్టి స్వదేశానికి బయలుదేరింది టీమిండియా. ఈ క్రమంలో రోహిత్ తన దగ్గరున్న పాస్ పోర్ట్ మర్చిపోయాడు. దీంతో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడిని పిలిచి తన పాస్‌పోర్టు తీసుకురావాలని అడిగాడు.

ALSO READ: కింగ్ నే ఇమిటేట్ చేస్తావా.. అందరి ముందు ఇషాన్ కిషన్ పరువు తీసిన కోహ్లీ

ఇది చూసిన టీంమేట్స్ అందరూ రోహిత్‌ను ఒక ఆటాడేసుకున్నారు. కాసేపటికి సపోర్ట్ స్టాఫ్ పాస్ పోర్ట్ తీసుకురాగానే భారత ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొత్తానికి రోహిత్.. పాస్ పోర్ట్ మర్చిపోయి టీం మేట్స్ ముందు పరువు పోగొట్టుకున్నాడు.