రోహిత్‌‌‌‌ రెడీయా..! ఇవాళ ( జూన్ 13 ) అఫ్గానిస్తాన్ తో టీం ఇండియా తోలి వన్డే... హార్దిక్ ప్లేస్ లో నితీష్ కుమార్..

రోహిత్‌‌‌‌ రెడీయా..! ఇవాళ ( జూన్ 13 ) అఫ్గానిస్తాన్ తో టీం ఇండియా తోలి వన్డే... హార్దిక్ ప్లేస్ లో నితీష్ కుమార్..

సంచలనంపై అఫ్గాన్‌‌‌‌ దృష్టి
మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌లో లైవ్‌‌‌‌

ధర్మశాల: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌పై టీమిండియా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌కు రెడీ అయ్యింది. దాంతో శనివారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌ జరగనుంది. రెండు దేశాల మధ్య ఇది తొలి ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌ కావడంతో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌‌‌‌లో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో పాటు, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్న తెలుగు ప్లేయర్‌‌‌‌ నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రదర్శనపైనే అందరి దృష్టి నెలకొంది. 

ఐపీఎల్‌‌‌‌ టైమ్‌‌‌‌లో తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడిన రోహిత్‌‌‌‌ ప్రస్తుతానికి పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించాడు. అయితే 2027 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు రోహిత్‌‌‌‌కు 39 ఏళ్లు వస్తుండటంతో అతడు అప్పటివరకు వన్డేల్లో కొనసాగుతాడా అనే సందేహాలు మొదలయ్యాయి. హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ గాయంతో కోహ్లీ ఈ సిరీస్‌‌‌‌కు అందుబాటులో లేకపోవడం కూడా జట్టుకు ఎదురుదెబ్బ. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ముందు టీమిండియా 25 వన్డేలు ఆడనుండటంతో కొత్త ప్లేయర్లను పరీక్షించేందుకు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రెడీ అవుతోంది.

కోహ్లీ ప్లేస్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌!

ఈ మ్యాచ్‌‌‌‌లో ఓపెనర్లుగా రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌ దిగనుండగా కోహ్లీ ప్లేస్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ లేదా యశస్వి జైస్వాల్‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌ ఉంది. టీ20 కొత్త కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ కమ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ నాలుగైదు స్థానాల్లో బ్యాటింగ్‌‌‌‌ చేయనున్నారు. కెప్టెన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఫామ్‌‌‌‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆరో ప్లేస్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ నితీశ్‌‌‌‌ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌‌‌‌లో బ్యాట్‌‌‌‌, బాల్‌‌‌‌తో ఆకట్టుకున్న నితీశ్‌‌‌‌.. పాండ్యాకు సరైన బ్యాకప్‌‌‌‌ అని భావిస్తున్నారు. 

అయితే మీడియం పేసర్‌‌‌‌గా వన్డేల్లో పది ఓవర్ల కోటాను పూర్తి చేసే సామర్థ్యం ఉందా? లేదా? అనేది ఈ సిరీస్‌‌‌‌తో తేలిపోనుంది. కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ స్పిన్‌‌‌‌ బాధ్యతలు పంచుకోనున్నారు. బుమ్రా, సిరాజ్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇవ్వడంతో పేస్‌‌‌‌ బలాన్ని అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ మోయనున్నారు. ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌, గుర్నూర్‌‌‌‌ బ్రార్‌‌‌‌ డెబ్యూ చేసే చాన్స్‌‌‌‌ ఉంది.

అఫ్గాన్‌‌‌‌తో ప్రమాదమే.. 

టెస్టు మ్యాచ్‌‌‌‌లో ఓడిపోయినప్పటికీ, వైట్‌‌‌‌బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో అఫ్గానిస్థాన్ ప్రమాదకరమైన జట్టు. శస్త్రచికిత్స తర్వాత స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులోకి రావడం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. హష్మతుల్లా షాహిదీ నాయకత్వంలోని అఫ్గాన్ జట్టులో మహ్మద్ నబీ లాంటి సీనియర్లు ఉన్నారు. చల్లని వాతావరణం, మంచు కొండల నడుమ సాగే ఈ పోరులో గెలిచి సంచలనం సృష్టించాలని అఫ్గాన్‌‌‌‌ భావిస్తోంది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రోహిత్‌‌‌‌ శర్మ, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, సుందర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ / గుర్నూర్‌‌‌‌ బ్రార్‌‌‌‌. 
అఫ్గానిస్తాన్‌‌‌‌: హష్మతుల్లా షాహిది (కెప్టెన్‌‌‌‌), ఇబ్రహీం జద్రాన్‌‌‌‌, రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌, సెడిఖుల్లా అటల్‌‌‌‌, రహమత్‌‌‌‌ షా, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌, ఇక్రామ్‌‌‌‌ అలీఖిల్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ నబీ, రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సలీమ్‌‌‌‌, గజాన్‌‌‌‌ఫర్‌‌‌‌, జియావుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌. 

పిచ్‌‌‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలం. కొత్త బంతితో స్వింగ్‌‌‌‌ లభించే చాన్స్‌‌‌‌ ఉంది. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఐదుసార్లు, ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన జట్లు నాలుగుసార్లు గెలిచాయి. వర్షం ముప్పు లేదు. 

వన్డేల్లో 3 వేల రన్స్‌‌‌‌ చేయడానికి  శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌కు కావాల్సిన పరుగులు 23. గిల్‌‌‌‌ మరో 47 రన్స్‌‌‌‌ చేస్తే ఈ ఫీట్‌‌‌‌ను అందుకుంటాడు.