ఈడెన్ గార్డెన్స్‌లో హిట్‌మ్యాన్ రచ్చ.. కేకేఆర్ కోచ్ను ఇమిటేట్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేసిన రోహిత్ 

ఈడెన్ గార్డెన్స్‌లో హిట్‌మ్యాన్ రచ్చ.. కేకేఆర్ కోచ్ను ఇమిటేట్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేసిన రోహిత్ 

Rohit Sharma: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ తన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌తో సహచర ఆటగాళ్లని మొహాల్లో నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

భాయ్.. ఏంటి ఈ హైప్?:  
ప్రాక్టీస్ సెషన్ సమయంలో రోహిత్ శర్మ బౌలింగ్ వేయడానికి సిద్ధమవడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా అలజడి సృష్టించారు. రోహిత్ బౌలింగ్ ప్రాక్టీస్‌ను విపరీతంగా పొగుడుతూ, కావాలనే పెద్ద 'హైప్' క్రియేట్ చేస్తూ రోహిత్‌ను ఆటపట్టించడం ప్రారంభించారు. దీనిపై హిట్‌మ్యాన్ తనదైన శైలిలో స్పందించాడు. “భాయ్.. ఏంటి ఈ హైప్? అంటే నేనేమైనా రెగ్యులర్ బౌలర్‌నా ఏంటి!” అంటూ హిట్‌మ్యాన్ వేసిన సెటైర్‌కు అక్కడున్న ఆటగాళ్లంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో ఇలాంటి సరదా క్షణాలు జట్టు వాతావరణాన్ని తేలికగా పరచడానికి ఎంతగానో సహాయపడతాయి.

కేకేఆర్ కోచ్ యాక్షన్‌ను దింపేసిన హిట్‌మ్యాన్: 
అక్కడితో ఆగని రోహిత్ శర్మ.. ముంబై మాజీ సహచరుడు, ప్రస్తుత కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను టార్గెట్ చేశాడు. కేకేఆర్ నెట్స్‌లో ఉన్న నాయర్‌ను గట్టిగా పిలిచిన రోహిత్.. ఆయన మీడియం పేస్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చం అలాగే ఇమిటేట్ (అనుకరిస్తూ) చేస్తూ బౌలింగ్ వేశాడు. ఇక రోహిత్ వేసిన ఆ బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. తాను వికెట్ తీశాననే విషయం ఆలస్యంగా గమనించి హిట్‌మ్యాన్ షాక్‌కు గురయ్యాడు. అతడు చేసిన ఈ అల్లరి, ఇమిటేషన్ చూసి అభిషేక్ నాయర్‌తో పాటు ముంబై, కోల్‌కతా క్యాంప్‌లోని ప్లేయర్స్ ఒక్కసారిగా నవ్వేశారు. ముంబై ఇండియన్స్ ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా.. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

2027 వరల్డ్ కప్ లక్ష్యం:
దేశవాళీ క్రికెట్ రోజుల నుంచి రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్‌లు అత్యంత ఆప్తమిత్రులు. గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో నాయర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఆఫ్‌ సీజన్‌లో రోహిత్ ఫిట్‌నెస్ సాధించడంలో అభిషేక్ కోచింగ్ ఎంతో సహాయపడింది. అంతటి ప్రాణస్నేహితుడు కావడంతోనే రోహిత్ మైదానంలో అంతలా ఆట ఆటపట్టించాడు.

►ALSO READ | రిషభ్ పంత్కి బీసీసీఐ బిగ్ షాక్.. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్