Shot Yaar: పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ.. నెట్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై జట్టు నెట్ సెషన్లో ఈ యువ లెఫ్ట్ హ్యాండర్ క్లాసిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తిలక్ బ్యాటింగ్ స్టైల్‌ను దగ్గరుండి గమనించిన టీమిండియా మాజీ కెప్టెన్, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ అతని షాట్ సెలెక్షన్‌కు ఫిదా అయిపోయాడు.
నోరెళ్లబెట్టిన హిట్‌మ్యాన్!:
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తిలక్ వర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ.. ఒక బంతికి మోకాళ్లపై కూర్చుని స్ట్రెయిట్‌గా లాంగ్ ఆన్ దిశగా కొట్టిన షాట్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి పడింది. పక్కనే నిలబడి ఈ షాట్‌ను చూసిన రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తిలక్ టైమింగ్‌ను మెచ్చుకుంటూ తనదైన శైలిలో “షాట్ యార్” అంటూ ప్రశంసలు గుప్పించాడు. ఒక లెజెండరీ బ్యాటర్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడంతో తిలక్ వర్మతో పాటు ముంబై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
పంజాబ్‌పై మ్యాచ్ విన్నర్:
ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ ఇచ్చిన బూస్ట్తోనే తిలక్ ప్రస్తుతం వన్-ఆఫ్-ది బెస్ట్ రిథమ్‌లో కనపడుతున్నాడు.
ప్లేఆఫ్స్ రేసులో లేని ముంబై:
ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. కానీ మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసే సత్తా ముంబైకి ఉంది. రాబోయే మ్యాచుల్లో ముంబై విజయం సాధిస్తే టాప్-4 రేసులో ఉన్న జట్ల సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
తదుపరి పోరు: ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 20వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. ప్లేఆఫ్స్ కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్న కేకేఆర్‌కు ముంబై ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో మరీ వేచి చూడాల్సిందే!
Shot so good, even Rohit is in awe 🫡 pic.twitter.com/BfNBt8V6n0
— Mumbai Indians (@mipaltan) May 16, 2026
