
గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి నిర్విరా మంగా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ , వాషింగ్టన్ సుందర్ తో సహా ఎనిమిది మందికి.. ఇంగ్లండ్ తో జరిగే మూడు మ్యాచ్ ల సిరీస్ నుంచి బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో లిమిటెడ్ ఓవర్స్ టీమ్‌లో మార్పులు చోటు చేసుకోనున్నా యి. వ్యక్తిగత కారణాలతో ఫైనల్ టెస్ట్ కు దూరమైన బుమ్రాను ఇప్పటి కే టీ20 సిరీస్‌కు దూరంగా ఉంచిన బోర్డు.. ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోంది. క్రికెటర్లు బయో బబుల్ లో ఎక్కు వగా ఉండటం వల్ల మానసిక సమస్యలు వస్తాయని బోర్డు పెద్దలు భావిస్తున్నారు . వన్డే టీమ్ ను ప్రకటించేలోపే.. విరామం కావాలనుకుంటున్న క్రికెటర్లు బ్రేక్ అప్షన్ ను ఎంచుకోవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది బిజీ షెడ్యూల్ ఉండటంతో టీమ్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్లేయర్లకు చాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు కూడా యోచిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షి ప్ , టీ20 వరల్డ్ కప్ , సౌతాఫ్రికా టూర్ ఉండటంతో క్రికెటర్లను ఎప్పటి కప్పుడు ఫ్రెష్ గా ఉంచేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.