
ఐపీఎల్-12 టైటిల్ కొట్టాక రోహిత్ శర్మ ఫుల్ టైం తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ కు ఇంకా రెండు వారాల టైం ఉండటంతో తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య రీతిక, కుమార్తె సమైరా తల్లిదండ్రులతో గడుపుతున్నాడు. భార్య రీతికతో బీచ్ ను చుట్టేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి హోటల్ లో డిన్నర్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను రోహిత్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రెజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.