Roja Selvamani: సినిమాల్లోని రోజా రీఎంట్రీ.. సెకండ్ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

Roja Selvamani: సినిమాల్లోని రోజా రీఎంట్రీ.. సెకండ్ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

కోట్లాది మంది సినీ ప్రియులను అలరించే గ్లామర్ ప్రపంచంతో కెరీర్ మొదలు పెట్టి.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నటి, రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి. దక్షిణాదిలో దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తన నటన, అభియనంతో ప్రేక్షకులను మెప్పించింది.  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ పెట్టేసింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు సినీ పరిశ్రమలోకి  రీఎంట్రీ ఇచ్చింది.

 సుదీర్ఘ విరామ తర్వాత తిరిగి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది రోజా .   ఇప్పుడు 'లెనిన్ పాండియన్' అనే చిత్రంతో వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.. తమిళ సినీ దిగ్గజం శివాజీ గణేశన్ మనవడు ధార్షన్ గణేశన్ ఈ చిత్రంలో నటుడిగా పరిచయమవుతున్నారు. రోజా రీఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రానికి డి.డి. బాలచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కించినట్లు సమాచారం.

'లెనిన్ పాండియన్'  చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గేయ రచయిత, దర్శకుడు అయిన గంగై అమరెన్ తొలిసారిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.  ఈ మూవీలో ధార్షన్ ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా గ్రామీణ నేపథ్యంలో, ఆత్మగౌరవం కోసం పోరాడే ఇద్దరు వ్యక్తుల కథగా రూపొందుతున్నట్టు ధార్షన్ తెలిపారు.

 ఇందులో రోజా 'శాంతనం' అనే పాత్రను పోషించనున్నారు. 2015లో ఆమె నటించిన 'కిల్లాడి', 'పులన్ విసారణై 2', 'ఎన్ వాళి తని వాళి'  మూడు చిత్రాల తర్వాత, ఇప్పుడు ఈ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రోజా రీ ఎంట్రీపై నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ స్వాగతించారు. ఈ మూవీ టీమ్ కు,  ధార్షన్ గణేశన్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ చిత్రంలో శ్రితా రావు, అర్చన రవిచంద్రన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై టి.జి. త్యాగరాజన్ సమర్పిస్తున్నారు. సాంకేతిక విభాగంలో ఎ.ఎమ్. ఎడ్విన్ సకయ్ సినిమాటోగ్రఫీ, నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్, అతూరి జైకుమార్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత, తిరిగి నటనపై ఆసక్తి చూపడం ద్వారా రోజా సెల్వమణి సినీ ప్రియులందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ వెండితెరపై ఆమె చూపించబోయే నటన, ఆమె రాజకీయ అనుభవాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో చూడాలి.