
ప్రియదర్శి, ఆనంది జంటగా సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్ యు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను హీరో నాని లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్‌కు శ్రీమణి రాసిన లిరిక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉన్నాయి.
అబ్బీ వి పాడిన తీరు ఆకట్టుకుంది. ‘దోచావే నన్నే నువ్విలా.. దాచావే నన్నే నీలో వెన్నెల..’ అంటూ సాగిన పాటలో ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ నేచురల్‌గా ఉంటూ ఇంప్రెస్ చేస్తుంది. కార్తీక్ తుపురాణి, రాజ్ కుమార్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విష్ణునాథ్ రెడ్డి, ఎడిటర్‌గా రాఘవేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్‌గా అరవింద్ ములే వర్క్ చేస్తున్నారు. మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని మేకర్స్ చెప్పారు.