ఫిదా చేస్తున్న వరుణ్ తేజ్ రొమాంటిక్ స్టిల్

ఫిదా చేస్తున్న వరుణ్ తేజ్ రొమాంటిక్ స్టిల్

"గాండీవధారి అర్జున".. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen Sattaru) కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ మూవీ ఆగస్ట్ 25 న విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌ (Sri Venkateshwara Cini Chitra) పై నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్(B.V.S.N Prasad) నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 19 సాక్షి వైద్య పుట్టినరోజు సందర్బంగా ఆమెకు విషేష్ తెలుపుతూ ఒక రొమాంటిక్ పోస్టర్ ని రీలిజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో లవ్ సింబల్ మధ్య కనిపిస్తున్న వరుణ్, వైద్య జంట చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. వరుణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాకు.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.