ఎన్నికల గైడ్​లైన్స్ పాటించాలి: రోనాల్డ్ రాస్

ఎన్నికల గైడ్​లైన్స్ పాటించాలి: రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్​ను జారీ చేస్తుందని, వాటిని పరిగణలోనికి తీసుకొని ముందుకు పోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్  తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నియమాలపై శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చారు. 

 ఈ సందర్భంగా నామినేషన్ల ధ్రువీకరణ, పాటించాల్సిన అంశాలపై రోనాల్డ్ రాస్ ఆర్వోలకు అవగాహన కల్పించారు. రిజర్వ్​డ్​, అన్ రిజర్వ్​డ్​​ సింబల్స్ అలాట్ మెంట్​పైనా వివరించారు. అసెంబ్లీ ఎన్నికల  ఎన్నికల వ్యయ పరిశీలకులు,  ఫ్లయింగ్ స్టాటిస్టిక్స్, వీడియో స్టాటిస్టిక్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పట్టుబడిన క్యాష్,  వస్తువుల వివరాలను జిల్లా ఫిర్యాదుల కమిటీకి కమిటీకి తెలియజేయాలని వివరించారు.  ఎప్పటికప్పుడు ఎన్నికల శిక్షణ కొనసాగుతుందని, ఏవైనా  డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్  సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, అధికారులు పాల్గొన్నారు.