
హన్మకొండ జిల్లా: హసన్ పర్తి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. హసన్ పర్తీ ప్రభుత్వ పాఠశాల్లోని 10 తరగతి గదిలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్కూల్ టీచర్లు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ట్రీట్ మెంట్ తర్వాత స్టూడెంట్స్ ని ఇంటికి పంపించామని తెలిపిన ఉపాధ్యాయులు.. పాత బిల్డింగ్ కావటంతోనే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.