Mowgli 2025: విడుదలకు సిద్దమైన మోగ్లీ... అంచనాలు పెంచిన ‘వనవాసం’ పాట

Mowgli 2025: విడుదలకు సిద్దమైన మోగ్లీ... అంచనాలు పెంచిన ‘వనవాసం’ పాట

యాంకర్ సుమ తనయుడు, రోషన్ కనకాల నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). సాక్షి మడోల్కర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. బండి సరోజ్ కుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా (Nov27న) మేకర్స్‘మోగ్లీ’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. వనవాసం అంటూ సాగే ఈ పాట ఆసక్తిగా, అర్ధవంతంగా ఉంది. ‘అడవి అంటే అమ్మే కదా.. అడగకున్నా తోడై రాదా’ అంటూ సాగే ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్‌ అందించగా.. కాలభైరవ కంపోజ్ చేసిన ఈ పాటను సింగర్ సోనీతో కలిసి పాడారు.

‘‘ఆ సీత రామ వనవాసన్నే చూసిన అడవే మనదే.. ఆ అంతటి ప్రేమే వస్తానంటే.. కాలి లేదనే అనదే.. దారి పొడవునా తానే దాచింది కథలే.. మాటలదాకా మనకే చెబుతుంది బదులే.. రామాయణం మలుపులు తీసుకున్న చోటే ఇది’’ అనే పదాలతో యుద్ధం చేశాడు లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి.  

ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో యూనిక్ రొమాంటిక్ గా ‘మోగ్లీ’ తెరకెక్కింది. ఇప్పటికే, నాని వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌‌తో విడుదలైన ఈ మూవీ  గ్లింప్స్, ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజైన టీజర్.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ప్రేమను రక్షించుకోవడానికి ఎంతదూరమైన వెళ్లే యువకుడిగా రోషన్‌ కనకాల పాత్ర శక్తివంతగా డిజైన్ చేశాడు డైరెక్టర్ సందీప్. అది టీజర్ విజువల్స్లో స్పష్టంగా అర్ధమయ్యేలా ఉంది.  

టీజర్ బట్టే చూస్తే.. ‘‘ఫారెస్ట్‌‌‌‌లో హ్యాపీగా సాగిపోతున్న హీరో మోగ్లీ జీవితంలోకి హీరోయిన్‌‌‌‌ రాకతో ప్రపంచం మరింత కొత్తగా కనిపిస్తుంది. తను పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని, తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ‘నేను రాముడుని, తను నా సీత..’ అని గర్వంగా చెబుతాడు. రావణుడు లేడులే అనుకుంటున్న టైమ్‌‌‌‌లో పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా‌‌‌‌ బండి సరోజ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తన ప్రేమను దక్కించుకునేందుకు మోగ్లీ ఎలాంటి యుద్ధం చేశాడనేది’’ మెయిన్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇకపోతే, బండి సరోజ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.