Champion Box Office: యంగ్ హీరో రోషన్ మాస్ రాంపేజ్.. 'ఛాంపియన్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Champion Box Office: యంగ్ హీరో రోషన్ మాస్ రాంపేజ్.. 'ఛాంపియన్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను నిరూపించుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion) థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. మొదటి రోజే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. 

రోషన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్..

శ్రీకాంత్ తనయుడిగా కాకుండా, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రోషన్‌కు ‘ఛాంపియన్’ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

సక్సెస్ మంత్రం...

దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా, 1980ల నాటి పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా మలిచిన తీరు అద్భుతంగా ఉంది. స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. ముఖ్యంగా మలయాళ బ్యూటీ అనస్వరా రాజన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.  మిక్కీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా క్లైమాక్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్ ,  షైన్ టామ్ చాకో వంటి హేమాహేమీలు తమ నటనతో కథకు ప్రాణం పోశారు. మౌత్ టాక్ బలంగా ఉండటంతో బుక్ మై షో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రేటింగ్స్ దూసుకుపోతున్నాయి.

►ALSO READ | South Indian Box Office 2025 : బాక్సాఫీస్ రిపోర్ట్ 2025 : వెండితెరపై సౌత్ ఇండియన్ సినిమాల వసూళ్ల గర్జన!

వీకెండ్ టార్గెట్..

మొదటి రోజు వసూళ్లు చూస్తుంటే, ఈ వీకెండ్ ముగిసే సమయానికి ‘ఛాంపియన్’ క్లీన్ హిట్ స్టేటస్‌కు చేరువయ్యేలా కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు , న్యూ ఇయర్ బజ్ తోడవ్వడంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా రోషన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి, ఛాంపియన్ సినిమాతో రోషన్ మేక టాలీవుడ్‌లో తనకంటూ ఒక బలమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.