
హర్ష నర్రా, మేఘలేఖ జంటగా సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, ఖుష్బూ చౌదరి ముఖ్య పాత్రల్లో విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు.
ఏప్రిల్ 12న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘కథను నమ్మి ఎమోషనల్‌గా ఫీల్ అయి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘నలుగురు ఫ్రెండ్స్ కథ ఇది. వారి స్నేహం, ప్రేమ, లైఫ్ జర్నీ ఇందులో చూపిస్తున్నాం. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి’ అని దర్శకుడు చెప్పాడు. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చుతుందని నటీనటులు చెప్పారు.