
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ మూబిన్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో రిపోర్టర్ ముబిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ముబిన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేసింది సోహెల్ గ్యాంగ్. ఇప్పుడు తప్పించుకున్నా...ఎప్పటికైనా మర్డర్ చేస్తానంటూ సోహెల్ వార్నింగ్ ఇచ్చారు.
సోహెల్ , అతని అనుచరుల అరాచకాలను యూట్యూబ్ ఛానల్ లో టెలిక్యాస్ట్ చేసి నందుకు రిపోర్టర్ పై సోహెల్ గ్యాంగ్ పగబట్టింది. యూట్యూబ్ నుంచి తమకు సంబంధించిన లింక్ తీసేయకపోతే...చంపుతానని బెదిరించారు. కానీ వార్తకు సంబంధించిన లింక్ తొలగించలేదు మూబిన్. దీంతో మూబీన్ పై కత్తులతో దాడి చేశారు.
రౌడీ షీటర్ సోహెల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు బాధితుడు రిపోర్టర్ ముబిన్. అతనికి జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. దాడి ఘటనపై బాధితుడు ముబిన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు.