20 ఏళ్ల తర్వాత ఒడిశాలో కనిపించిన బెంగాల్ టైగర్

20 ఏళ్ల తర్వాత ఒడిశాలో కనిపించిన బెంగాల్ టైగర్

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లా అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ పులిని గుర్తించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ బెంగాల్ టైగర్ మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్ నుండి వలస వచ్చినట్లు ఆయన అంచనా వేశారు.  దాదాపు ఇరవై ఏళ్లలో ఇక్కడ పులి కనిపించడం ఇదే తొలిసారి అని తన పోస్టులో తెలిపారు.  ఒడిశా వన్యప్రాణుల ప్రేమికులకు ఇదోక గొప్ప వార్త అని అభిప్రాయపడ్డారు.  

ప్రపంచంలోని పులుల జనాభాలో కనీసం 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. 1973లో దేశంలో మొత్తం 268 పులుల ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కించింది. పులుల జాతిని పరిరక్షించడానికి కేంద్రంలోని మోదీ సర్కార్  ప్రాజెక్ట్ టైగర్ ను ఫ్రారంభించింది.   ప్రాజెక్ట్ టైగర్ ప్రవేశపెట్టిన తర్వాత పులుల జాతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

2023 నాటికి  దేశంలో గరిష్టంగా 3,935 పులులు ఉన్నాయి. 785 పులులతో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఒడిశా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఆల్ ఒడిషా టైగర్ ఎస్టిమేషన్ 2023-24 ప్రకారం రాష్ట్రంలోని అడవులలో 30 పెద్ద పులులు, ఎనిమిది పిల్లలు ఉన్నాయి. మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో 27 (14 ఆడ, 13 మగ) పులులు ఉన్నట్లుగా గుర్తించింది.