RCBతో ఎలిమినేటర్ మ్యాచ్: టాస్ గెలిచిన రైజర్స్

RCBతో ఎలిమినేటర్ మ్యాచ్: టాస్ గెలిచిన రైజర్స్

అబుదాబి: ఐపీఎల్‌‌-13లో మరో ఆసక్తికర  పోరుకు అంతా రెడీ అయ్యింది. భిన్నమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌‌కు చేరుకున్న సన్ ‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌, రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు శుక్రవారం ఎలిమినేటర్‌‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్‌‌ చేరుకున్న హైదరాబాద్‌‌ సెకండ్‌‌ టైటిల్‌‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌‌కు వచ్చిన బెంగళూరు ఈసారైనా విజేతగా నిలవాలని చూస్తోంది. అంతదూరం వెళ్లాలంటే  ముందుగా ఎలిమినేటర్‌‌ గండాన్ని దాటాలి. మరి, చివరి మూడు మ్యాచ్‌‌ల్లో గెలిచి ఊపు మీదున్న రైజర్స్‌‌ జోరు కొనసాగుతుందో లేదో చూడాలి. ఆల్ ద బెస్ట్ హైదరాబాద్.

టీమ్స్