KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్టులో సిరాజ్, గ్రీన్

KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్టులో సిరాజ్, గ్రీన్

ఐపీఎల్ లో నేడు సూపర్ ఫైట్ జరగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరోవైపు కేకేఆర్ ఆడిన 6 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. సిరాజ్, మయాంక్ దగర్,గ్రీన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

Also Read: ఓటమిలో ఎప్పడూ తలవంచకు: పంత్‌కు గవాస్కర్ ఓదార్పు